కామారెడ్డి ప్రీమియర్ లీగ్.. విజేతలకు బహుమతులు అందించిన పోచారం

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి ప్రీమియర్ లీగ్ (KPL) విజయవంతంగా ముగిసింది. ఈ నెల 16 న ప్రారంభమైన సీజన్ 1 ఇన్విటేషన్ టోర్నమెంట్ లో భాగంగా బాన్సువాడలో చివరి మ్యాచ్ జరిగింది. ఆర్గనైజర్ Ch రాజు, కో ఆప్షన్ మెంబర్ గౌస్ భాయ్ ఆధ్వర్యంలో జరిగిన KPL ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా బాన్సువాడ ఎమ్మెల్యే, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy)తో పాటు ఆగ్రో చైర్మన్ కాసుల బాల్ రాజు, శంభు రెడ్డి, మహమ్మద్ ఏజాజ్ భాయ్, కృష్ణారెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, సీఐ శ్రీధర్ హాజరయ్యారు.

KPL మ్యాచ్ లో కామారెడ్డి, తాడ్ కోల్, బొల్లారం, బాన్సువాడ జట్లు కప్ లు సాధించాయి. మొదటి బహుమతి లక్షన్నర, రెండో బహుమతి లక్ష, మూడో బహుమతి ఐదు వేలు నాలుగో బహుమతి రూ.2500 ప్రకటించారు. విజేతలకు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas) నగదు బహుమతులు అందించారు. కబడ్డీ లాంటి క్రీడలు యువతకు ఎంతో దోహదం చేస్తాయని పోచారం చెప్పారు. యువకులను క్రీడలలో ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే బాన్సువాడ లో మినీ స్టేడియం నిర్మించామని తెలిపారు. గెలుపోటములు సహజం అని గెలుపు కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>