కలం, నిజామాబాద్ బ్యూరో: బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ (Bandi Sanjay) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ కాంగ్రెస్ (Nizamabad Congress) నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నూడా చైర్మన్ కేశ వేణులు మీడియాతో మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులుగా బండి సంజయ్ కొడుకు బండి భగీరత్ మైనర్ బాలికపై వస్తున్న ఆరోపణల కారణంగా అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మైనర్ బాలిక తో పాటు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
దీనిపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి డీజీపీతో మాట్లాడి మైనర్ బాలికకు వెంటనే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పుకొచ్చారు. దేశం కోసం ధర్మం కోసం అని ప్రగల్బాలు పలికే బీజేపీ నాయకులు ఎందుకు ఒక హిందూ బాలికకు అన్యాయం జరిగితే స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందూ మతం పేరుతో ఎల్లప్పుడూ మాట్లాడే బీజేపీ నాయకులు హిందూ బాలిక విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు సమాధానం చెప్పాలని నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బాలికకు న్యాయం జరిగే విధంగా వ్యవహరించాలని నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గొప్పలు చెప్పడం జరిగిందని, కానీ ఎందుకు బండి భగీరథ్ చేసిన అన్యాయంపై మాట్లాడలేదని ప్రశ్నించారు. దీనిపై మోడీ ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు వివరించాలని, వెంటనే బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఇది ఇంతటితో ఆగకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లి బాలికకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులలో వాస్తవాలకు, అవాస్తవాలకు తేడా తెలియకుండా స్పందించే బీజేపీ నాయకులు ఒక మైనర్ బాలికపై బండి భగీరథ్ చేసిన ఆకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
దీనికి బండి సంజయ్ బాధ్యత వహిస్తూ విచారణ పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని, కేసు విచారణ పూర్తి అయ్యే వరకు తన మంత్రి పదవికి రాజీనామా చేసి బండి సంజయ్ తన నిజాయితీ నిరూపించుకోవాలని చేశారు. డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, ఏఐసీసీ కో ఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవి, జగడం సుమన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గణేష్, ఆకుల చిన్న రాజేశ్వర్, పార్థ సారథి, కిష్ట గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్
Follow Us On: Sharechat

