శ్రీకాళహస్తిలో పట్టపగలే రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. కానిస్టేబుల్‌పై దాడి

కలం, వెబ్ డెస్క్: ఏపీలో గత కొద్దిరోజులుగా అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్‌‌లు రెచ్చిపోతున్నాయి. ఇటీవల రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటన మరువకముందే, తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో (Srikalahasti) గంజాయి బ్యాచ్ పట్టపగలే రెచ్చిపోయింది. ఇదేమిటని తనిఖి చేసిన కానిస్టేబుల్‌‌పైనే దాడి చేయడం ఏపీలో కలకలం రేపుతోంది.

గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్‌పైనే దాడి చేయడంతోపాటు, కత్తులతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>