తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో (Vidya Varotsavalu) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థపై ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యా విధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 25 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపామని, మరో 500 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశీ శిక్షణకు పంపినట్లు వెల్లడించారు.

ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని చేశామన్నారు. విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి అయోగ్ సైతం అభినందించిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, అందుకే విద్యార్థులు ఉద్యమించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు నిలవాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) సూచించారు.

Read Also : రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ: ఈటల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>