Mobile Popup Ad
Mobile Popup Ad

జూన్ 10న ఎన్డీయే కాన్‌క్లేవ్.. సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

కలం, వెబ్ డెస్క్: జూన్ పదో తేదీన దిల్లీలో ఎన్డీయే కూటమి కాన్‌క్లేవ్ జరగబోతుంది. ప్రధాని మోదీ (PM Modi)  ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో భేటీ కాబోతున్నారు. 22 రాష్ట్రాలకు చెందిన కూటమి నేతలు ప్రధాని మోదీని ఘనంగా సన్మానించబోతున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ హాజరు కాబోతున్నారు. కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభిన్ కూడా పాల్గొనబోతున్నారు.

మోదీ పాలనపై ప్రత్యేక తీర్మానాలు..

ఎన్డీయే కూటమి (NDA Alliance) కాన్‌క్లేవ్‌లో ప్రధాని మోదీ గత 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక తీర్మానం చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చర్చించబోతున్నారు. ‘వికసిత భారత్ 2047’ లక్ష్యంపైనా ప్రధాని మోదీ (PM Modi) దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పన, కేంద్ర–రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యూహాలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Read Also:  సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణ స్వీకారం డేట్‌ ఫిక్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>