Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణ స్వీకారం డేట్‌ ఫిక్స్

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక నూతన సీఎంగా డీకే.శివకుమార్ (DK Shivakumar) ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ ఒకటో తేదీన బెంగళూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతో పాటు కొందరు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు కర్ణాటక శాసనసభా‌పక్ష సమావేశం జరగబోతుంది. దీనిలో డీకే.శివకుమార్‌ను తమ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయగానే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే కానుంది.

కీలక శాఖల కోసం సిద్ధరామయ్య పట్టు..

సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah).. తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్రను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే అధిష్ఠానానికి సూచించారు. అంతేగాకుండా విద్య, వైద్యం, బీసీ సంక్షేమ శాఖలను కూడా కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో కీలక నేత, తనకు అత్యంత సన్నిహితుడైన అహింద కమ్యూనిటీకి చెందిన సతీష్ జక్రిహోలీకి పీసీసీ చీఫ్​ పదవితో పాటు కీలక శాఖలు ఇవ్వాలని కోరుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రి పదవులపై క్లారిటీ రాబోతుంది.

Read Also: మహిళల ఆర్థిక స్వావలంబనకు చారిత్రాత్మక నిర్ణయాలు : మంత్రి సీతక్క

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>