epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా..

కలం, సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram).. గుంటూరు కారం తర్వాత తెరకెక్కిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam Movie). విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ మూవీ కోసం త్రివిక్రమ్ స్టైల్ మార్చారని తెలిసింది. కొత్తగా ఈ మూవీ కోసం మరో హీరోని రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి..? ఆదర్శ కుటుంబం.. థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

త్రివిక్రమ్ సినిమా అంటే.. చక్కని హాస్యం.. హృదయాలను కదిలించే భావోద్వేగాలతో.. బంధాలు.. అనుబంధాలు గొప్పతనం తెలియచేసేలా ఉంటాయి. అందుకనే త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే.. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి అనుకుంటారు. అందులోనూ వెంకీ హీరో అయితే.. వేరే లెవల్లో ఉంటుంది. వెంకీ సంక్రాంతి వస్తున్నాం సినిమాతో లాస్ట్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ తో కలిసి నటించి మరోసారి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు.

ఆదర్శ కుటుంబం అనే టైటిల్ కి హౌస్ నెంబర్ 47 అనే ట్యాగ్ లైన్ పెట్టారు. త్రివిక్రమ్ (Trivikram) సినిమా అంటే.. ఒక హీరో, ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఒక సమస్య. ఆ సమస్యను హీరో సాల్వ్ చేయడం.. ఇది రొటీన్ అయిపోయిందని గుంటూరు కారం సినిమా రిలీజ్ టైమ్ లో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను సీరియస్ గా తీసుకున్న త్రివిక్రమ్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కాస్త క్రైమ్ టచ్ ఇచ్చారని ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే.. సినిమా పై మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇందులో నారా వారి అబ్బాయి నారా రోహిత్ (Nara Rohith) కీలక పాత్ర పోషిస్తున్నారట. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈసారి నారా రోహిత్ తో కీలక పాత్ర చేయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఇదే కనుక నిజమైతే.. వెంకీ మామ, నారా రోహిత్ కలిసి ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఈ మూవీతో వెంకీ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.

Read Also: మారుతి నెక్ట్స్ ఏంటి..?

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>