టీడీపీలో ఒక జబ్బుంది.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన వేళ నారా లోకేష్ (Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఒక జబ్బుందని .. దాని పేరు అలక అని వ్యాఖ్యానించారు. నేతలు అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది కార్యకర్తలని చెప్పారు. ఏ సమస్య ఉన్న 4 గోడల మధ్య మాట్లాడుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరుసగా ఒకే పార్టీ గెలవడం వల్ల గుజరాత్ లో అభివృద్ధి సాధ్యమైందన్న లోకేష్.. మళ్లీ 2029లో గెలిచేలా పార్టీ నేతలు పనిచేయాలని చెప్పారు.

వాళ్లది విధ్వంసం.. మనది అభివృద్ధి

సైకో పార్టీ ఏదో సినిమా చూపిస్తానంటోందని వైసీపీని ఉద్ధేశించి లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావొద్దని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>