కలం, వెబ్‌డెస్క్: పలు హింసాత్మక ఘటనలు, తీవ్ర ఉత్కంఠ నడుమ పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం ముగిసింది. సాయంత్రం వరకు సుమారు 90 శాతానికి పైగా పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 దాటినా పోలింగ్ కేంద్రాల వద్ద జనం భారీగా క్యూ కట్టారు. ఇక జిల్లాల వారీగా చూస్తే పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 92.46 శాతం ఓటింగ్ నమోదైంది. హుగ్లీలో 90.34 శాతం, హౌరాలో 89.44 శాతం ఓటింగ్ నమోదైంది. కోల్‌కతా, దక్షిణ బెంగాల్‌లో టీఎంసీ కంచుకోటలుగా భావించే 142 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. రెండో దశలో అత్యంత కీలకమైన నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి ఒకే బూత్ ప్రాంతంలో తారసపడటంతో తీవ్ర కలకలం రేగింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడునున్నాయి.

