తుంబాడ్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఫిక్స్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రాంతీయ చిత్రంగా విడుద‌లై ఇండియ‌న్ సినిమాలోనే క్లాసిక్ హార‌ర్ చిత్రంగా గుర్తింపు పొందిన తుంబాడ్ (Tumbbad) సీక్వెల్ విడుద‌ల‌కు ముహూర్తం ఖ‌రారైంది. న‌టుడు, నిర్మాత సోహ‌మ్ షా బుధ‌వారం త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తుంబాడ్ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ తుంబాడ్ -2 సినిమాను 2027 డిసెంబ‌ర్ 3 విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పోస్ట‌ర్‌లో రాసిన కొన్ని లైన్లు సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేస్తున్నాయి. పోస్టర్ పై పాప‌పు గ‌తం.. భ‌యంక‌ర‌మైన భ‌విష్య‌త్తు.. ఆక‌లి పెరుగుతోంది.. దురాశ వార‌స‌త్వం కొన‌సాగుతోంది.. అంటూ సినిమాపై ఆస‌క్లి పెంచేలా రాసుకొచ్చారు. ఇక తుంబాడ్ సీక్వెల్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తుంబాడ్ ఫ‌స్ట్ ఫార్ట్ తెర‌కెక్కించిన రాహి అనిల్ బార్వే స్థానంలో ఈసారి ఆదేశ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఫ‌స్ట్ పార్ట్‌లో ఎమోష‌న్స్ కోల్పోకుండా మ‌రింత భ‌యంక‌రంగా, ఆస‌క్తిక‌ర పురాణగాథ‌ల‌తో ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్న‌ట్లు మూవీ యూనిట్ వెల్ల‌డించింది. సినిమా ఫ‌స్ట్ పార్ట్ సాధించిన స‌క్సెస్‌తో సీక్వెల్‌పై భారీ అంచ‌నాలున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>