కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాను నిషేధించడంపై (Social Media Ban) స్టడీ చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ (Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ బ్లూమ్బర్గ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషధం (Social Media Ban) ఉందని, ఈ క్రమంలో ఏపీలో కూడా సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు వారు వినియోగించకుండా నిషేధం విధించడంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఒక నిర్ధిష్ట వయస్సున్న వారు ఇలాంటి ప్లాట్ ఫామ్ లో ఉండకూడదని.. వాటిల్లో వచ్చే కంటెంట్ ను వారు అర్థం చేసుకోలేరని వెల్లడించారు. దీని కోసం ఒక బలమైన, చట్టపరమైన ఫ్రేమ్ వర్క దిశగా తాము ఆలోచిస్తున్నామని లోకేశ్ తెలిపారు.
Read Also: ఆస్ట్రేలియాలో కాల్పులు.. ముగ్గురి మృతి..
Follow Us On: Instagram


