మార్చి13న జాబ్ మేళా.. 800కు పైగా ఉద్యోగ అవకాశాలు

కలం, మెదక్ బ్యూరో : డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్ తయారీ యూనిట్, జహీరాబాద్‌ (Zaheerabad) లో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 13న ప్రత్యేక జాబ్ మేళా(Job Fair) నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్ తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.

అర్హత కలిగిన యువత తమ విద్యా ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటా, ఇతర అవసరమైన ధ్రువ పత్రాలతో జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఆయన కోరారు. మార్చి 13 శుక్రవారం రోజున ఉదయం 9.00 గంటల నుండి సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట్, హనుమాన్ నగర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా జహీరాబాద్‌లోని (Zaheerabad) ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా కంపెనీలో 800కు పైగా ఖాళీలను ట్రెయినీ, అప్రెంటిస్ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారని వెల్లడించారు.

Read Also: రెండ్రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ల డెలివరీ : కేంద్రం

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>