కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ (KTR) సిట్ విచారణకు హాజరవవడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. విచారణలో భాగంగా అధికారులు కేటీఆర్‌ను ఏం అడుగుతున్నారు? ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? ఈ కేసులో సిట్ అధికారులు ఇంకా ఎవరెవరిని విచారిస్తారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం రాజకీయ కక్షతో ఫోన్ ట్యాపింగ్ కేసును తెరమీదకు తెచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై మంత్రి అజహారుద్దీన్ (Azharuddin) స్పందించారు. ‘బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ పార్టీ నేతలే ఇటువంటి ఆరోపణలు చేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేసి విచారిస్తోంది. విచారణ పారదర్శకంగా సాగుతోంది. కేటీఆర్ విచారణకు సహకరించాలి. ఎంతపెద్ద నేత అయినా విచారణకు హాజరైనప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే‘ అంటూ అజహారుద్దీన్ పేర్కొన్నారు.
“ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే. అందరూ అలాగే చేస్తారు. అందులో తప్పేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. కాబట్టి దర్యాప్తు ద్వారా వెళ్లాల్సిందే” అంటూ అజహారుద్దీన్ (Azharuddin) వ్యాఖ్యానించారు.
ఇక చాలా మంది కాంగ్రెస్ నేతలు సైతం స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ అరాచకాలకు పాల్పడ్డారని.. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎంతో మందిని బెదిరించారని విమర్శించారు. నేరుగా కేసీఆర్ కుటుంబానికి చెందిన కవితే ఇటువంటి ఆరోపణలు చేసిందని వారు గుర్తు చేశారు.
Read Also: చెల్లెలు ఆరోపణలకు కేటీఆర్ ఆన్సర్ ఏంటి: పీసీసీ చీఫ్
Follow Us On: Sharechat


