కలం, వరంగల్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ట పాలన సాగిస్తున్నాడని శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి (Sirikonda Madhusudanachary) విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని, రేవంత్ రెడ్డి పాలనలో రెండు జరుగుతున్నాయని ద్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చరిత్ర సమస్తం హీనమని మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేశారని.. కాంగ్రెస్ కు పాలనా అనుభవం ఉన్నా.. చెడు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందన్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత, రైతుల చెప్పుల క్యూ ఉంది అని విమర్శించారు. పంట కొనుగోలు లేదని, సాగు నీటి, తాగు నీటి ఎద్దడి వేధిస్తోందన్నారు.
అనంతరం, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మే 6న వరంగల్ వేదికగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. కానీ డిక్లరేషన్ అమలు మరిచిందని, అందుకే వారి నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకే రైతుల కోసం పోరాడేందుకే రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, బడే నాగజ్యోతి, నాయకులు కాకుల మర్రి లక్ష్మణ్ రావు, హరి రమా దేవి, పులి రజినీకాంత్, నాయిముద్దీన్, రాజ్ కిషోర్, జానకిరాములు, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

