పిల్లలపై స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్.. లేటెస్ట్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

కలం, వెబ్​ డెస్క్​: ఏడాది‌లోపు వయసున్న చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీంతో పిల్లలు మూడేండ్ల వయసు వచ్చేసరికి ఆటిజం బారిన పడే ప్రమాదం ఉందని ఎయిమ్స్ (AIIMS Study) న్యూఢిల్లీ పరిశోధనలో తేలింది. చిన్న వయసులోనే డిజిటల్ స్క్రీన్లకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు తగ్గుతాయి. ప్రధానంగా ఆటిజం లక్షణాలు కనిపించే అవకాశం పెరుగుతుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. స్క్రీన్ వాడకం పెరిగే కొద్దీ పిల్లల మానసిక వికాసంపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై స్క్రీన్ ప్రభావం (Screen Time) గురించి ఎయిమ్స్ పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ షెఫాలీ గులాటి కీలక సూచనలు చేశారు. 18 నెలల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను స్క్రీన్లకు (మొబైల్, టాబ్లెట్, టీవీ) పూర్తిగా దూరంగా ఉంచాలని చెప్తున్నారు. చిన్నారుల మెదడు ఎదుగుదల కీలక దశలో ఉన్నప్పుడు డిజిటల్ కంటే తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం మంచింది. శారీరక ఆటలు ఆడించడం వారి ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఎంతో అవసరమని డాక్టర్ గులాటి పేర్కొన్నారు.

Read Also: జ్యోతిష శాస్త్రంలో సరికొత్త విప్లవం.. ఈ యాప్‌‌తో దోష నివారణకు చెక్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>