epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

కేసీఆర్, హ‌రీశ్ చుట్టాల‌కే బొగ్గు టెండ‌ర్లు : ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్

క‌లం, వెబ్ డెస్క్: సింగ‌రేణిలో (Singareni) నాలుగు టెండ‌ర్లు జ‌రిగితే అందులో మూడు టెండ‌ర్లు కేసీఆర్‌ (KCR), హ‌రీశ్ రావు (Harish Rao) చుట్టాల‌కే వ‌చ్చాయ‌ని ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ (Addanki Dayakar) అన్నారు. సింగ‌రేణి టెండ‌ర్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్న హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌పై అద్దంకి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాంగ్రెస్ స్కాం చేస్తే బీఆర్ఎస్ వాళ్ల‌కు టెండ‌ర్లు ఎలా ద‌క్కుతాయ‌ని ప్ర‌శ్నించారు. సైట్ విజిట్ అనేది అంద‌రికీ క‌ల్పించినా అర్హ‌త ఉన్న వాళ్ల‌కే టెండ‌ర్లు ద‌క్కాయ‌న్నారు. వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లేన‌ని పేర్కొన్నారు. చుట్టాల నుంచి ముడుపులు రాక‌పోవ‌డంతో టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని అంటున్నారా అని ప్ర‌శ్నించారు.

హ‌రీశ్ రావు అతి తెలివితో ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, మ‌ధ్యలో డిప్యూటీ సీఎంను, సృజ‌న్ రెడ్డిని ప్ర‌స్తావించ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని అన్నారు. భ‌ట్టి ఈ అంశంపై సీఎంతో చ‌ర్చిస్తాన‌న్న దానిపై హ‌రీశ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ద‌యాక‌ర్ (Addanki Dayakar) కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు అవినీతి జ‌ర‌గ‌న‌ప్పుడు ఇందులో ప‌ట్టించుకోవాల్సింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు. అబ‌ద్ధాన్ని నిజం చేసేందుకే కేటీఆర్, హ‌రీశ్ రావు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హ‌రీశ్‌, కేటీఆర్ చేసే అబ‌ద్ధ‌పు ఆరోప‌ణ‌ల‌ను ప‌ట్టించుకోర‌ని చెప్పారు. జిల్లాల మార్పుపై ఒక‌రు, కోల్ స్కాంపై ఒక‌రు సీఎంను టార్గెట్ చేసి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉంద‌ని, అతి తెలివితో బీఆర్ఎస్ నేత‌లు చేసే ప్ర‌క‌ట‌న‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని తెలిపారు.

Read Also: శుభాంశు శుక్లాకు అశోక చక్ర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>