కలం, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడాపోటీలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని కేటీఆర్ (KTR) ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల మత్తు వదిలించుకోవడానికి గ్రౌండ్‌లోకి రమ్మంటున్నామని శ్రీహరి అన్నారు. కేటీఆర్ గ్రౌండ్‌లోకే రానంటే ఏం చేస్తామని వ్యాఖ్యానించారు. అయినా కేటీఆర్ ఆడే ఆటలు వేరు అని, తాము ఆడుకునే ఆటలు వేరు అని కామెంట్ చేశారు.
ఈ పోటీలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండగా క్రీడా పోటీలు అవసరమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ క్రీడా పోటీలలో పాల్గొనరని వెల్లడించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు.
Read Also: అధికార పక్షానికి ఓ న్యాయం.. విపక్షానికి ఓ న్యాయమా?
Follow Us On: Instagram

