కవిత కొత్త పార్టీపై రఘునందన్ రావు కీలక కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త పార్టీ ప్రకటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పెడుతుందని తాను గత ఏడాదే చెప్పానని గుర్తుచేశారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైందని.. ఆ ముక్కలేవీ ఎన్నికల వరకు నిలబడవు అని తేల్చారు. కవిత పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపించకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలేశ్వరంపై చర్యలు ఇంకా ఎందుకు లేవో? ఇరు పార్టీలకే తెలియాలని వ్యాఖ్యానించారు.

కాగా, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కవిత తన కొత్త పార్టీపై అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధివిధానాలు ప్రకటించబోతున్నట్లు ఆమె ప్రకటించారు. హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెన్షన్‌ హాల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆవిష్కరణ, జెండా విడుదల చేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 6 వద్ద ఉన్న 20 ఎకరాల భారీ స్థలంలో ఈ సభను నిర్వహించనున్నట్లు కవిత స్పష్టం చేశారు.

Read Also: అధికార పక్షానికి ఓ న్యాయం.. విపక్షానికి ఓ న్యాయమా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>