Mobile Popup Ad
Mobile Popup Ad

అధికార పక్షానికి ఓ న్యాయం.. విపక్షానికి ఓ న్యాయమా?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్రమ మైనింగ్ వ్యవహారంపై హరీశ్‌రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమమైనింగ్ ఆరోపణల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. గతంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తే అతడి సోదరుడిని ప్రభుత్వం నెల రోజులపాటూ జైల్లో ఉంచిందని గుర్తు చేశారు. కానీ ఇవే రకమైన ఆరోపణలు వస్తే పొంగులేటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఆ క్రషర్‌పై చర్యలు తీసుకోరా?

పొంగులేటి సంస్థలపై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్న రాఘవ క్రషర్స్ వంటి సంస్థలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులపై సరైన విచారణ జరగలేదని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పదవిలో ఉన్న వ్యక్తి పై ఆరోపణలు ఉన్నప్పుడు స్వతంత్ర విచారణకు మార్గం సుగమం చేయాలని ఆయన పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Read Also: BRS బడా నేతలకు బిగ్ షాకిచ్చిన CM రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>