epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ ను కాలుష్య రహిత మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. దావోస్​ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (Davos WEF)లో సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై వారు చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Davos WEF | రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని విద్యుత్ (క్లీన్ ఎలక్ట్రిసిటీ), గ్రీన్ హైడ్రోజన్ అందించాలనే ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తున్నది అని తెలిపారు. డేటా సెంటర్ల నుంచి అధిక స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోందని చెప్పారు. నూతన తెలంగాణ ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా క్యూర్ ప్యూర్ రేర్ (CURE–PURE–RARE ) ఫ్రేమ్‌వర్క్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>