కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో (Amaravati) ఈ ఏడాది తొలిసారిగా రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి నారాయణ (Minister Narayana) శనివారం ఉదయం పరిశీలించారు. గ్రౌండ్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. వేడుకల రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ డే కోసం పరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. వీవీఐపీ, వీఐపీ పార్కింగ్‌కు 15 ఎకరాలు కేటాయించారు. 25 ఎకరాల్లో పబ్లిక్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో మొత్తం 13 వేల మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు.

Read Also: అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు.. భక్తుల ఆగ్రహం
Follow Us On: Sharechat


