Mobile Popup Ad
Mobile Popup Ad

విజయవాడలో పారిశుద్ధ్య డ్రైవ్ ప్రారంభించిన మంత్రి నారాయణ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా నాలుగు వారాల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ (Sanitation Drive) ప్రారంభమైంది. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వయంగా రోడ్లు ఊడ్చి శుభ్రతపై సందేశం ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నగర పరిశుభ్రతపై అవగాహన కల్పించిన మంత్రి, ప్రజల భాగస్వామ్యమే ఈ కార్యక్రమ విజయానికి కీలకమని తెలిపారు. కార్యక్రమం అనంతరం మంత్రి నారాయణ స్థానిక అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, ప్రజారోగ్యం అంశాలపై ఆయన ప్రజలతో మాట్లాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>