కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR), స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ (Dragon) సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ‘గ్లింప్స్’ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతూ 100 మిలియన్‌కు పైగా డిజిటల్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. “ది డ్రాగన్ కీప్స్ బ్రీతింగ్ ఫైర్ అక్రాస్ ఎవ్రీ ప్లాట్‌ఫామ్” అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళం స్టార్ బిజు మీనన్ కీలక పాత్రలో నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై సినీ వర్గాలలో భారీ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో #డ్రాగన్ గ్లింప్స్, # ఎన్టీఆర్-నీల్ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.

