Mobile Popup Ad
Mobile Popup Ad

బీర్లు.. సెలయేర్లు.. రోజుకు పాతిక లక్షల బాటిళ్ళు తాగేస్తున్నారు!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.. హైదరాబాద్ సహా జిల్లాలన్నీ నిప్పుల కొలిమిలా మారిపోయాయి. ఇరవై ఏండ్ల రికార్డు ఈ సంవత్సరం బ్రేక్ అయింది. మద్యం ప్రియులు మాత్రం చల్లటి బీర్లతో ‘చిల్’ అవుతున్నారు. ఉదయం నుంచే వేడి మొదలవడంతో దాహార్తికి బీర్లు ఆల్టర్నేట్‌గా మారాయి. మందుబాబులు ఎండల సాకుతో తెగ తాగేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా బీర్ల విక్రయాల్లో (Telangana Beer Sales) సరికొత్త రికార్డు నమోదైంది. గత నెలలో (30 రోజుల్లో) 56.21 లక్షల కేసుల బీర్లు సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21% ఎక్కువ. ఈ ఏడాది మే నెలలో ఇరవై రోజుల్లోనే 40 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. గతేడాది మే నెలతో పోలిస్తే దాదాపు ఆరు లక్షలకంటే ఎక్కువ. ఏప్రిల్ నెలలో రోజుకు సగటున 22.48 లక్షల బీరు బాటిళ్ళను తాగేస్తే ఈ నెలలో అది 24.10 లక్షలు దాటింది. గతేడాది మే నెలతో పోలిస్తే బీర్ సేల్స్ 18% ఎక్కువ నమోదైంది.

హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళకు తిప్పలు పడాల్సి వస్తున్నదిగానీ బీరుకు మాత్రం ఢోకా లేదు. ఎండాకాలం ఏరులన్నీ ఎండిపోయినా బీరు మాత్రం సెలయేరులా ప్రవహిస్తూనే ఉన్నది. ఈ ఏడాది మార్చి నెల నుంచే ఎండలు ముదరడంతో దానికి తగినట్లుగానే బీర్ సేల్స్ కూడా పెరిగిపోయింది. ఎక్సయిజ్ శాఖకు గతేడాది ఏప్రిల్‌లో 3,272 కోట్ల ఆదాయం వస్తే ఈసారి అది రూ. 3,618 కోట్లకు పెరిగింది. మే నెల గణాంకాలను పరిశీలిస్తే గతేడాది ఇరవై రోజుల్లో 1,895 కోట్ల ఆదాయం సమకూరితే ఈసారి అది రూ. 2,083 కోట్లకు పెరిగింది. ప్రతీ రోజు సగటున బీర్ సేల్స్ 14% చొప్పున పెరుగుతున్నది. వీకెండ్స్ రోజుల్లో మరికొంత పెరగడంతో సగటున నెలకు 18% సేల్స్ ఎక్కువవుతున్నది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు కురవడంతో ప టు బీర్ ధరలను పెంచినందున సేల్స్ కాస్త తగ్గిందని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈసారి మాత్రం ఎండల కారణంగా బీర్ సేల్స్ గణనీయంగా పెరిగింది.

రాష్ట్రంలో బీర్ సేల్స్‌ను లెక్కల్లో చూస్తే…

గతేడాది ఏప్రిల్‌లో బీర్ సేల్స్ : 46.46 లక్షల కేసులు (ఒక్కో కేసుకు 12 బీర్ బాటిళ్లు ఉంటాయి)
ఈ ఏడాది ఏప్రిల్‌లో సేల్స్ : 56.21 లక్షల కేసులు
గతేడాది ఏప్రిల్‌లో ఎక్సయిజ్ ఆదాయం : రూ. 3,272 కోట్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్సయిజ్ ఆదాయం : రూ. 3,618 కోట్లు
గతేడాది మే నెలలో (20 రోజులకు) : 33.94 లక్షల కేసులు
ఈ ఏడాది మే నెలలో : 40.16 లక్షల కేసులు
గతేడాది మే నెలలో (20 రోజులకు) ఎక్సయిజ్ ఆదాయం : 1,895 కోట్లు
ఈ ఏడాది మే నెలలో : రూ. 2,083 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>