Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

కలం, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రం కొచ్చిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ (International Sex Racket) ముఠా గుట్టు రట్టు అయింది. మోడలింగ్ పేరిట విదేశాల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి స్టోయ్ సీ సింధు అనే మహిళను ముంబై ఎయిర్‌పోర్టులో పోలీసులు లుకౌట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులను సైతం అరెస్ట్ చేశారు.

విదేశాల్లో మోడలింగ్, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపి ఈ ముఠా యువతుల్ని వ్యభిచారంలోకి దింపుతోంది. విదేశాలకు తీసుకెళ్లాక యువతులకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక వారిపై లైంగిక దాడులు చేయించి వీడియోలు తీస్తారు. ఆ వీడియోలు చూపిస్తూ, పాస్‌పోర్టులను లాక్కుని బాధితులను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఈ రాకెట్ నుంచి తప్పించుకున్న ఇద్దరు బాధిత యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టడంతో ఈ అంతర్జాతీయ నేర ముఠా ఘటన వెలుగులోకి వచ్చింది.

యువతులను పరిచయం చేసిన బ్రోకర్లు, ఏజెంట్లకు నిందితులు ఒక్కో అమ్మాయికి రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు భారీగా కమీషన్లు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాకెట్ వెనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీస్ అధికారులు సిట్ (SIT) ఏర్పాటు చేశారు. యువతుల్ని పరిచయం చేసిన ఏజెంట్లకు భారీగా డబ్బు ఇస్తున్నట్లు తేల్చారు. విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు కొచ్చి పోలీసులు ఇంటర్‌పోల్ సాయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఏజెంట్ల ద్వారా యువతులను లోబరుచుకుంటున్న ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>