కలం, నల్లగొండ బ్యూరో: జాన్‌పహాడ్ దర్గా (Janpahad Dargah) సర్వమత సమ్మేళ్ళానికి ప్రతీక అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) అన్నారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకుని మాట్లాడారు. జాన్‌పహాడ్ దర్గాకు అన్ని వర్గాల ప్రజలు వస్తారని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులందరూ ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారని అన్నారు.
ఉర్సు ప్రతి ఏటా చాలా బాగా జరుగుతుందని, ఇన్షా అల్లాహ్ వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్‌డిఓ శ్రీనివాసులు, డిఎస్‌పి ప్రసన్న కుమార్, మైనార్టీ సంక్షేమ అధికారి నరసింహరావు, తహసీల్దార్ కమలాకర్, వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహబూబ్, ముజవర్ జానీ బాబా, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


