Mobile Popup Ad
Mobile Popup Ad

బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి పరామర్శ

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో కట్ట అశోక్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్ తీవ్రంగా గాయపడ్డారు. మొదట కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) గాంధీ ఆసుపత్రిలో మృతదేహానికి నివాళులు అర్పించారు.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా రూ. 20 వేలు అందించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి (Adluri Laxman Kumar) తెలిపారు. మంత్రి వెంట నంది మేడారం గ్రామ సర్పంచి వీర్ పాల్ తదితరులు ఉన్నారు.

Read Also: ఆ విషయం సీఎం రేవంత్‌ రెడ్డికి తెలుసు: కిషన్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>