కలం, వెబ్ డెస్క్ : మేడారం మహా జాతర (Medaram Jatara) జనవరి 28 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు జరగబోతోంది. ఈ జాతర కోసం ట్రాన్స్ పోర్టు పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. మేడారం మహా జాతర (Medaram Jatara) ఇప్పుడు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీల్లో రాష్ట్రంలోని సికింద్రాబాద్, ఖమ్మం, నిజమాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ల నుంచి వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పౌరసంబంధాల అధికారి ఎం.శ్రీధర్ ప్రకటించారు.
సికింద్రాబాద్-మంచిర్యాల్ రైళ్ల టైమింగ్స్..
సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల్ కు వెళ్లే రైళ్లు జనవరి 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో కాజీపేట మీదుగా నడుస్తాయి. ఉదయం 5.45గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. కాజీపేటకు ఉదయం 8.45 గంటలకు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్ రీచ్ అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజీపేటకు వస్తుంది. అక్కడి నుంచి రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-కాగజ్ నగర్ వెళ్లే రైళ్లు..
సికింద్రాబాద్-కాగజ్ నగర్ వెళ్లే రైళ్లు ఈ నెల 29, 31వ తేదీల్లో కాజీపేట మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి కాజీపేటకు 8.45 గంటలకు ట్రైన్ రీచ్ అవుతుంది. అక్కడి నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ అదే రైలు సిర్పూర్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి.. కాజీపేటకు రాత్రి 7.45 గంటలకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ కు రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుంది.
నిజమాబాద్-వరంగల్ రైళ్ల టైమింగ్స్..
నిజమాబాద్ నుంచి వరంగల్ కు ఈ నెల 28 నుంచి 31 దాకా స్పెషల్ ట్రైన్లు నడుస్తాయి. ఉదయం 7.05 గంటలకు నిజమాబాద్ నుంచి నుంచి బయలుదేరి వరంగల్ కు మధ్యాహ్నం 2 గంటలకు రీచ్ అవుతుంది. అదే ట్రైన్ తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్ నుంచి స్టార్ట్ అయి.. రాత్రి 10.30 గంటలకు నిజమాబాద్ చేరకుంటుంది.
ఆదిలాబాద్-కాజీపేట రైళ్ల టైమింగ్స్..
ఆదిలాబాద్ నుంచి కాజీపేటకు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి 29న ఉదయం 11.45గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అదే ట్రైన్ 29న మధ్యాహ్నం 1.15 గంటలకు స్టార్ట్ అయి 30వ తేదీన తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.
ఖమ్మం-కాజీపేట ట్రైన్ టైమింగ్స్..
ఖమ్మం నుంచి కాజీపేటకు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ట్రైన్లు నడుస్తాయి. ఖమ్మం నుంచి ఉదయం 10 గంటలకు ట్రైన్ బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేటకు వస్తుంది. అదే ట్రైన్ మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేట నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఇలా రైళ్లు పలు స్టేషన్ల నుంచి కాజీపేట, వరంగల్ స్టేషన్ల వరకు వస్తున్నాయి. అక్కడి నుంచి మేడారం మహాజాతరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


