Mobile Popup Ad
Mobile Popup Ad

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 49 కిలోల గంజాయి సీజ్

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో (Delhi Airport) భారీ స్థాయిలో విదేశీ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల లగేజీలో సుమారు 49 కిలోల గంజాయి ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.48 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన లగేజీని తనిఖీ చేయగా ఈ భారీ డ్రగ్స్ రవాణా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోంది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Read Also: బీర్లు.. సెలయేర్లు.. రోజుకు పాతిక లక్షల బాటిళ్ళు తాగేస్తున్నారు!

Follow Us On:  X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>