గజ్వేల్‌లో రోడ్డెక్కిన రైతులు.. రోడ్డుపై వరి ధాన్యం పోసి నిరసన!

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్‌ (Gajwel) లో రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదంటూ గజ్వేల్-తూప్రాన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై వరి ధాన్యం పోసి తగలబెట్టారు.

ప్రభుత్వం వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంట కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.

Read Also: రైతు సమస్యలపై కేటీఆర్–కవితల రాజకీయ యుద్ధం

Follow Us On:  X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>