కలం, వెబ్ డెస్క్ : హన్మకొండకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతిపై ప్రముఖ నటుడు సోనూ సూద్ (Sonu Sood) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన నిరంజన్ కుటుంబసభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి పరామర్శించారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని నిరంజన్ కుటుంబానికి సోనూ సూద్ సూచించారు. కాగా, గత నెల నిరంజన్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అక్కడి వెళ్లిన సోనూ సూద్ అతనితో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలోనే నిరంజన్‌కు కొత్త డ్రెస్‌లు, బొమ్మలు ఇచ్చి ధైర్యం చెప్పారు. తాజాగా నిరంజన్ మృతితో అతని కుటుంబంతో సోనూ సూద్ మాట్లాడి ధైర్యం చెప్పిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

