రేవంత్ రెడ్డి సీఎంగా చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీలో ముంచుతున్న ఇండ్లకు జీరో వాల్యూ కాదని.. రేవంత్ రెడ్డి సీఎంగా చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ అంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్లకు జీరో వాల్యూ అని, విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ అంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మోసం ఎక్కడా లేదు అంటూ దుయ్యబట్టారు.

420 హామీలు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మన ఐటీ ఎగుమతులు రూ. 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ ఉద్యోగాలు 9 లక్షల 39 వేలకు చేరుకున్నాయని నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారని అన్నారు. 2023–24 సంవత్సరాల్లో 9 లక్షల 46 వేలు ఐటీ ఉద్యోగాలు ఉంటే.. మీ ప్రభుత్వం వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయని మీరే చెప్తున్నారా? అంటూ ప్రశ్నించారు. శ్రీధర్ బాబు ఏమో ఐటీ ఎగుమతులు రూ. 3.60 లక్షల కోట్లు దాటాయని అంటారు, నిన్న గవర్నర్ ప్రసంగంలో రూ. 3.13 లక్షల కోట్లు అంటారు.. ఏది వాస్తవం? అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని అన్నారని చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయింది, ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి క్యాబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలు వెతికేందుకు ఒక సిట్ వేయాలని అసెంబ్లీలో కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.

Read Also: వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం: భట్టి

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>