ఢిల్లీలో తప్పిన విమాన ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లో విమాన ప్రమాదం తప్పింది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం (Air India Flight) ప్రయాణం మధ్యలో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ఏటీసీ సూచనలతో పైలట్లు సేఫ్ ల్యాండింగ్ చేసినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి ప్రకటించారు. కిందకు దిగిన వెంటనే గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో ఉన్న ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.

విచారణకు ఆదేశం..

ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ విచారణకు ఆదేశించింది. పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఎయిరిండియాకు సూచించింది. దర్యాప్తులో భాగంగా సంబంధిత అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తామని.. ప్రయాణికుల భద్రతే ఎయిరిండియాకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

Also Read : నకిలీ ఎరువులపై కొరడా.. ఆ లిస్ట్‌లో తెలంగాణ ఫ‌స్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>