కలం, వెబ్ డెస్క్: డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi Stalin) భారీ ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది. నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తంజావూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఉదయం చెన్నైలో ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, తంజావూరు తరలిస్తున్నారు. ఉదయనిధి అరెస్టును సవాల్ చేస్తూ.. డీఎంకే లీగల్ సెల్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్ట్.. వెంటనే ఉదయనిధిని విడిచిపెట్టాలని తంజావూరు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఉదయనిధిని ఆదేశించింది.

