ఇవన్నీ చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలపాలి: మంత్రి కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడిన వ్యాఖ్యలకు మంత్రి కోమటి రెడ్డి (Komatireddy)వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని తెల్ల రేషన్ కార్డులు (Ration Cards), సన్న బియ్యం తాము ఇస్తున్నామని.. అందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 20వేల కోట్లతో కుల మతాలకు అతీతంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. అందుకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. ఆడ బిడ్డలు గుడికి, బడికి ఎక్కడికి పోయిన గౌరవంగా ఆర్టీసీ ఉచిత బస్సులో (Free Bus) ప్రయాణం చేస్తున్నారని.. ఇందుకు రూ.11వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పాలన్నారు.

ఏ గ్రామానికి పోయిన ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తూ 30 నుండి 40 ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నందుకు తమ ప్రభుత్వానికి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలని వ్యాఖ్యానించారు. మీకు ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి.. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నందుకు చెప్పాలా? డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలా? అంటూ దుయ్యబట్టారు. ‘కేటీఆర్ ఓపికగా తెచ్చుకొని మేము చెప్పేది వినండి. మేము మొదటగా పేదవాళ్లకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. రూ.లక్షల కోట్లతో అప్పుల బారిన పడిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు లేవు.. భూసేకరణ సరిగ్గా చేయకుండానే లక్షల కోట్ల అప్పులు చేశారు. మేము ఈ రెండున్నర సంవత్సరాల్లో 3లక్షల 25వేల కోట్ల అప్పుకు బాకీ కట్టి రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం. ఈ కార్యక్రమాలు చేసినందుకు మాకు ధన్యవాదాలు చెప్పాలి. పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశామని మీరు క్షమాపణ చెప్పాలి’ అని కోమటి రెడ్డి (Komatireddy) డిమాండ్ చేశారు.

Read Also: చికెన్​ ప్రియులు జాగ్రత్త.. అక్కడంతా కుళ్లిన మాంసమే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>