మెదక్ జిల్లాలో ఉగాది పండుగకు వేపపూత సమస్య

కలం, మెదక్ బ్యూరో : తెలుగు నూతన సంవత్సరం ఉగాది (Ugadi) అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అనే షడ్రుచులతో తయారయ్యే ఈ పచ్చడి పండుగకు ప్రత్యేకతను తెస్తుంది. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పచ్చడి అందిస్తుంది. వేపపువ్వుల చేదు, బెల్లం తీపి, మామిడి వగరు, పచ్చిమిర్చి కారం, ఉప్పు, చింతపండు పులుపుతో ఉగాది పచ్చడి తయారవుతుంది. ముఖ్యంగా వేపపువ్వుల చేదు జీవితంలో కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని సూచిస్తుంది. అయితే ఈ ఏడాది ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో ఉగాది పండుగకు వేపపూత దొరకకపోవడం (Neem Flower Shortage) ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

‘డై బ్యాక్‌’ ఎఫెక్ట్

మెదక్ (Medak) జిల్లాలో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా పచ్చగా ఉండాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వైరస్ ద్వారా వ్యాపించే ‘డై బ్యాక్’ (Die-back) అనే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో వేప చెట్లు ఆకులు, చిగుళ్లు, కొమ్మలు ఎండిపోతూ క్రమంగా క్షీణిస్తున్నాయి. సాధారణంగా మార్చి నెలలో కొత్త చిగుళ్లతో పచ్చగా కనిపించే వేప చెట్లు ఈసారి పూత లేకుండా వెలిసిపోయాయి. ‘ఫామాప్సిస్ అజాడిరక్టా’ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తోంది. గాలి ద్వారా, కీటకాల ద్వారా ఈ ఫంగస్ ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాప్తి చెందుతోంది.

ఈ ప్రభావంతో వేప చెట్లకు పూత తగ్గిపోవడంతో పాటు కొన్ని చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి గతంలో కనిపించినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ విస్తరిస్తోంది. ముఖ్యంగా చిన్న వయసు చెట్లు మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగి, చల్లని గాలిని అందించే వేప చెట్లు ఇలా క్షీణించడం పర్యావరణానికి కూడా ముప్పుగా మారుతోంది. ఉగాది పండుగలో ముఖ్యమైన వేపపూత దొరకకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: 22 నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ: ఆది శ్రీనివాస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>