Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో ఫేజ్-2 సాధించడంలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : మెట్రో రెండో దశను సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ మేరకు మెట్రో ఫేజ్-2 కు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్లే మెట్రో ఫేజ్-2 అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ ‘బడేభాయ్’ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేక పోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని రేవంత్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో రేవంత్ బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేవారు.

ఆ ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే

కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి హైదరాబాద్ మెట్రో రైలును పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ 28% మెట్రో పనులే చేసి ప్రాజెక్ట్‌ను చిక్కుల్లో వదిలేస్తే.. కేసీఆర్ 72 శాతం పనులని పూర్తి చేశారని వెల్లడించారు. మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>