Mobile Popup Ad
Mobile Popup Ad

నాలుగు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు.. సీఎంపై కేటీఆర్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: రైతు భరోసా నిధులు విడుదల చేయడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిందని దుయ్యబట్టారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీ చేశాడని మండిపడ్డారు. చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలని విమర్శించారు. 30 నెలల కాంగ్రెస్ ముదనష్టపు పాలనలో దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా? అని ఫైర్ అయ్యారు.

ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టి హడావిడి చేస్తున్నాడని.. రేవంత్ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే రూ.50 వేల కోట్లతో చేయాల్సిన రెండు లక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే రైతుల గొంతుకోశాడని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే.. రేవంత్ ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>