నిర్మల్ కోర్టులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానం (Nirmal District Court) లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day Celebrations) ను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి (Srivani) మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. దేశ స్వాతంత్య్రాన్ని సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>