Mobile Popup Ad
Mobile Popup Ad

తుది దశలో ‘వారణాసి’.. రాజమౌళి బిగ్ అప్‌డేట్

కలం, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి”(Varanasi). ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఏప్రిల్ 7, 2027న గ్రాండ్ రిలీజ్ కానుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే చిత్రంలోని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. ఇక చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, సినిమా పూర్తి కావడానికి ఇంకా సుమారు 80 రోజుల షూటింగ్ మిగిలి ఉందని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం వారణాసి షెడ్యూల్ కొనసాగుతుండగా, మిగిలిన షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేసేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>