సమరయోధుల త్యాగాలతోనే స్వాతంత్య్రం: డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి

కలం, వనపర్తి: స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేన రెడ్డి (Shiva Sena Reddy) అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, భగత్‌సింగ్‌ తదితర మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకోవాలన్నారు. ఎంతోమంది సమరయోధులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వేచ్ఛను సాధించారని పేర్కొన్నారు. సమరయోధుల ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే వారికి అందించే నిజమైన నివాళి అని శివసేన రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు తైలం శంకర్‌ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, కౌన్సిలర్లు, నాయకులు పగడాల శ్రీనివాస్‌, కోళ్ల వెంకటేష్‌, చీర్ల జనార్ధన్‌, ధనలక్ష్మి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు జానకిరాములు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>