కలం, వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచు (BRS Sarpanch)లతో ఆయన మాట్లాడారు. విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో తిరిగి పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ సర్పంచులను గెలిపించకపోతే ఇండ్లు ఇవ్వం, మెడలు పట్టుకొని తోసేస్తాం అని ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
“సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ అనే సోదరుడిని కాంగ్రెస్ గుండాలు కిరాతకంగా దాడి చేసి చంపేశారు. తిప్పర్తి మండలంలో బీఆర్ఎస్ నుంచి మహిళా అభ్యర్థి సర్పంచుగా నామినేషన్ వేస్తే, కోమటిరెడ్డి అనుచరులు ఆమె భర్తను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఇంకో దగ్గర బీఆర్ఎస్ కు ఓట్లు ఎక్కువ పడ్డాయని ఓట్ల స్లిప్పులను తీసుకెళ్లి మోరీలో వేశారు. ఇలా ఎన్నో దౌర్జన్యాలు చేసినా, అధికార పార్టీ దుర్మార్గులను తట్టుకుని రెండు విడతల్లో సత్తా చాటిన గులాబి శ్రేణులకు అభినందనలు” అని కేటీఆర్ (KTR) ఆరోపణలు చేశారు.
ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి, ఏదో ఒక కేసులో ఇరికించి బీఆర్ఎస్ సర్పంచ్ లను సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని, ఎవరికీ భయపడొద్దని భరోసానిచ్చారు. గ్రామాలకు రావాల్సిన డబ్బులను మోడీ, రేవంత్ రెడ్డి ఎవరూ ఆపలేరని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పని చేసిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తారని సర్పంచులకు మాత్రమే పని చేస్తారు, మళ్లీ మన ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పనిచేస్తారని కేటీఆర్ వెల్లడించారు.
Read Also: ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
Follow Us On: X(Twitter)


