కలం, వెబ్ డెస్క్: వీకెండ్ వచ్చిందంటే చాలు మందేయడం.. తాగిన మైకంలో రోడ్ల మీద వాహనాలు నడపడం(Drunk Driving) కొందరికి అలవాటుగా మారిపోయింది. డ్రంకెన్ డ్రైవ్ నేరమని తెలిసినా చాలా మంది మారడం లేదు. ఈ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో ఉద్యోగులు, చదువుకుంటున్న యువకులే ఉంటున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంలో వారం వ్యవధిలోలో 1,197 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 66 మందిని జైలుకు తరలించారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. 952 టూ వీలర్ వాహనాలు, 84 నాలుగు త్రీ వీలర్ వాహనాలు, 157 ఫోర్ వీలర్ వాహనాలు పట్టుబడ్డ వాటిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టబడ్డ వారిలో 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవారు 428 మంది ఉన్నారు .. 31 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్నవారు 374 మంది ఉన్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మధ్య వయస్సు వర్గం మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్(Drunk Driving) వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పట్టుబడిన వారిలో కొందరికి జరిమానాలు విధించగా, మోతాదుకు మించి మద్యం సేవించిన వారిని నేరుగా కోర్టుకు హాజరుపర్చి జైలుకు పంపించారు.
క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ చెక్‌పోస్టులు మరింతగా పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు, పబ్‌లు, బార్ల సమీపాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రజలు తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు.
Read Also: జీహెచ్ఎంసీలో డివిజన్లపై హైకోర్టులో పిటిషన్
Follow Us On: Youtube


