epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హెచ్​1బీ, హెచ్​4 వీసా వెట్టింగ్​ ప్రారంభం

కలం, వెబ్​డెస్క్​: H​1B, H4 వీసాదారులకు వెట్టింగ్ (Visa Vetting) ​ ప్రారంభమైంది. దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యుల సోషల్​ మీడియా ఖాతాలను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయా ఖాతాల ఐదేళ్ల డేటాను వారు సేకరిస్తున్నారు. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, ఎక్స్​, లింక్డిన్​ తదితర సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​లో H​1B, H​4 వీసాదారులు, వారి కుటుంబసభ్యుల పోస్టులు, షేర్​లు, కామెంట్లను ఎంబసీ ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది. అంతేకాదు, కొత్తగా ఈ వెట్టింగ్​ను జె,ఎఫ్​, ఎమ్​ కేటగిరీ వీసాలకు విస్తరించింది. కాగా, ఈ వెట్టింగ్​ ప్రక్రియ కారణంగానే నేటి నుంచి (డిసెంబర్​ 15) నుంచి జరగాల్సిన చాలా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.

వీటిలో అధికభాగం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్​కు వాయిదా వేశారు. దీంతో స్టాంపింగ్​​, ఇతర కార్యక్రమాలకు వచ్చి భారత్​లోనే చాలా మంది H​1B వీసాదారులు చిక్కుకుపోయారు. వీళ్లంతా తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతుండడంతో అమెరికా ఇమ్మిగ్రేషన్​ అలాటర్నీ అండ్​ అడ్వొకేట్​ ఎలెన్​ ఫ్రీమన్​.. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇవ్వాలని, లేదా నెక్ట్స్​ ఇంటర్వ్యూ వరకు సుదీర్ఘ సెలవు ఇవ్వాలని కోరారు. కాగా, అక్రమవలసలను అడ్డుకునేందుకంటూ ట్రంప్​ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిబంధన డాలర్​ డ్రీమ్స్​కు శరాఘాతమే. ఏటా అమెరికా జారీ చేసే హెచ్​1బీ వీసాల్లో దాదాపు సగానికిపైగా భారత్​కే వస్తున్నాయి. ఫీజు పెంపు, వెట్టింగ్ (Visa Vetting)​ నిబంధనలు తదితర వాటివల్ల ఇప్పుడు వీటిలో కోత పడనుంది. ప్రస్తుతం అమెరికాలో భారత్​ నుంచి 3లక్షల మందికిపైగా H​1B వీసాదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>