కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ (Formula E Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ACB) కీలక అడుగు వేసింది. ఈ ఒప్పందంలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ను ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొనడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది.
ఈ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్ (KTR)తో పాటు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఏ2గా, బిఎల్ఎన్ రెడ్డిని ఏ3గా, కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా ఏసీబీ చేర్చింది. అలాగే యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థను ఏ5గా ప్రతిపాదించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే సుమారు 55 కోట్ల రూపాయల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ తన విచారణలో గుర్తించింది.
ముఖ్యంగా ఆర్థిక శాఖ లేదా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇంత భారీ మొత్తంలో నిధుల బదిలీ జరగడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఏసీబీ పేర్కొంది. ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.
Read Also: అసెంబ్లీ సీట్లు 50శాతం పెంపు : కేంద్రం సంచలనం!
Follow Us On: X(Twitter)

