బీజేపీతో పొత్తుపై జనసేన క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: జనసేనతో (Janasena) పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా.. లేదా.. అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. అది జాతీయ నాయకత్వం పరిధిలోని అంశమని, ఇంతకు మించి స్పందించలేమన్నారు. అయితే, బీజేపీతో పొత్తు లేకపోయినా తెలంగాణలో జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ సహా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసేలా తాము కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు.

రాంచందర్ రావు ఏమన్నారంటే..

తెలంగాణలో బీజేపీ సొంతంగానే అధికారంలోకి రావాలని భావిస్తోందని రాంచందర్ రావు అన్నారు. జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఇరు పార్టీల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉంది. అక్కడ ఏ ఎన్నికల్లో అయినా.. మూడు పార్టీలే కలిసి అవగాహనతో పోటీ చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమిలో ఉన్నప్పటికీ, బీజేపీకి జనసేన అవసరం అంతగా లేదనేది ఇక్కడి నేతలు చెబుతున్న మాట. రాబోయే రోజుల్లో జరిగే వివిధ రకాల ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>