దాడుల‌పై వెన‌క్కి త‌గ్గ‌ని ఇరాన్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌త‌ల‌కు విరామం ప‌లుకుతూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌ (Iran)పై యుద్ధానికి బ్రేక్ చెప్పిన విష‌యం తెలిసిందే. కార‌ణాలు ఏవైనా ఐదు రోజుల పాటు యుద్ధం ఆపేస్తున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. కానీ, ఇరాన్ మాత్రం అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. 25వ రోజు దాడుల‌ను కొన‌సాగిస్తోంది. మ‌రోవైపు ఇరాన్ త‌మ‌తో రాజీకి వ‌చ్చింద‌ని, శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌న్న‌ ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ఆ దేశం ఖండిస్తోంది. ట్రంప్ అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌తో నాట‌కం ఆడుతున్నార‌ని విమ‌ర్శించింది. ట్రంప్ యుద్ధాన్ని ఆపుతున్నట్లు ప్ర‌క‌టించ‌డం త‌మ దేశ విజ‌య‌మ‌ని ఇరాన్ మీడియా ప్ర‌చారం చేస్తోంది. ఇరాన్ దాడుల‌కు భ‌య‌ప‌డే ట్రంప్ వెన‌క్కి త‌గ్గార‌ని క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. 25వ రోజు సైతం బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>