Mobile Popup Ad
Mobile Popup Ad

దుబాయ్‌లో భార‌త్‌ డ్ర‌గ్ మాఫియా డాన్ అరెస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: దుబాయ్‌ (Dubai)లో భారత్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ జస్వీందర్ (Jaswinder) అలియాస్ ‘జాజ్’ అరెస్ట్ అయ్యాడు. భారత నిఘా సంస్థల సమాచారంతో ఇంటర్‌పోల్ జాజ్‌ను అరెస్ట్ చేసింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా అతడిని అదుపులోకి తీసుకుంది. పంజాబ్ మూలాలు ఉండి బ్రిటీష్ పౌరసత్వం కలిగిన జాజ్, అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌కు మాస్టర్‌మైండ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

జాజ్ అమెరికన్ గూఢచారి సంస్థ సీఐఏ (CIA) కోసం పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారులు ఇంకా దీన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం మూడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్న జాజ్‌ను త్వరలోనే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాజ్‌ను (Jaswinder) విచారిస్తే దేశంలోని అతిపెద్ద డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

Read Also: గ్యాస్ కొర‌తపై ప్ర‌భుత్వాలు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే: కేటీఆర్

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>