Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌.. కేసీఆర్‌తో కీల‌క చ‌ర్చ‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎర్ర‌వెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్‌లో జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) చేరిక‌, త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న‌ పార్టీ ఆవిర్భావ స‌భ‌లు, ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. కేటీఆర్‌ నేడు జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని క‌లువ‌నున్నారు. ఈ మేర‌కు ఉద‌య‌మే హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరారు. మార్గ మ‌ధ్య‌లో కేసీఆర్‌ను క‌లిశారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ స‌భ నిర్వ‌హించేందుకు పార్టీ నిర్ణ‌యించింది.

అయితే ఎక్క‌డ నిర్వ‌హిస్తార‌న్న‌ది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. పార్టీ ఆవిర్భావ స‌భలోపు జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్‌లో చేరుతార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. జీవ‌న్ రెడ్డి ఎర్ర‌వెల్లిలో కేసీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతార‌ని తెలుస్తోంది. అలాగే జీవ‌న్ రెడ్డికి పార్టీలో ఇవ్వాల్సిన ప‌ద‌వుల గురించి కూడా కేటీఆర్, కేసీఆర్‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. చ‌ర్చ‌ల అనంత‌రం కేటీఆర్ (KTR) జ‌గిత్యాల‌కు బ‌య‌లుదేరారు.

Read Also: నాదర్‌గుల్ భూ వ్యవహారం.. పొంగులేటికి హరీశ్ రావు కౌంటర్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>