కలం, వెబ్ డెస్క్: నాదర్‌గుల్ భూముల (Nadargul Lands) వ్యవహారంలో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) రియాక్ట్ అయ్యారు. ‘నేను ఒక్కడినే అవినీతిపరుడిని కాదు నా సహచర మంత్రులు కూడా అవునీతిపరులే అని.. పొంగులేటి తనకి అంటిన బురద అందరికి అంటించాడు’ అని హరీశ్ రావు సెటైర్లు వేశాడు. జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి కుటుంబం, భట్టి విక్రమార్కకి చెందిన కుంభకోణాలను పొంగులేటి బయట పెట్టాడని హరీశ్ రావు అన్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో హరీశ్ రావు మాట్లాడారు.
నువ్వు పొగరు తగ్గించుకో పొగరులేటి అని విమర్శిస్తూ.. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ‘ప్రతిపక్షాలు నాదర్‌గుల్ అవినీతిని బయటపెట్టలేదు.. మేమే పెట్టామని రేవంత్ రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పినప్పుడు నువ్వు పక్కనే కూర్చున్నావు కదా?’ ప్రశ్నించారు. భూముల అవినీతి వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీలో నిలబడి ఎందుకు చెప్పలేదు అని పొంగులేటిని హరీష్ రావు ప్రశ్నించారు.
నాదర్‌గుల్ ప్రభుత్వ భూమి అని పొంగులేటి (Ponguleti) చెప్తున్నాడని, మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలేదని హరీశ్ రావు మండిపడ్డారు. పేదల ఇండ్ల మీదకి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లే హైడ్రా, ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడంలేదు హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు.
Read Also: ఎయిడ్స్‌పై అవగాహన.. కేబుల్ బ్రిడ్జ్‌పై మంత్రి దామోదర మానవహారం
Follow Us On: Facebook

